జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా ఎక్కడ కరువు వచ్చినా.. జనగామలో మాత్రం రాదు. పాత వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా వడ్లు పండించే తాలుకా జనగామ అని చెప్పారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తామని తెలిపారు. ఎన్నికలు చాలా సందర్భాల్లో వస్తయి. ఎవ్వడో చెప్పిండని.. ఓటు వేయకూడదు. ఓటు మన తలరాతను మార్చుతుంది.
రాష్ట్ర దిశ, దశను మార్చుతుంది. మన చేతిలో ఉండే బలమైన ఆయుధం ఓటు. ఆ ఓటును మంచికి మాత్రమే వినియోగించండి. జనగామ, భువనగిరి గ్రోత్ కారిడార్ గా మారాయి. తొమ్మిదేండ్ల కింద.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పట్లో కరెంట్ కష్టాలు, నీటి కష్టాలుండేవి. ఇప్పుడు ఆ కష్టాలన్ని తొలగిపోయాయి. దేవాదుళ, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాబోతున్నాయి. జనగామలో మాత్రం కరువు వచ్చే సమస్యే లేదు అని తెలిపారు సీఎం కేసీఆర్. మీ భూముల మీద హక్కు మీకే ఉండాలి. కాంగ్రెస్ కౌలు రైతులు అని కొత్త కథలు చెబుతుందని పేర్కొన్నారు.