ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? : హరీశ్ రావు

-

తమ సమస్యల పరిష్కారం కోసం స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళనపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతున్నదని స్టాఫ్ నర్సులు రెండు రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. మరో వైపు నిరుద్యోగులకు జాబ్ లు ప్రకటిస్తామని మాయ మాటలు చెప్పి వారిని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో కూడా కేవలం కొంత మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని.. మిగతా రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news