BREAKING: అర్దరాత్రి ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్

-

Karnataka Sx Scandal Accused Prajwal Revanna Arrested in Bengaluru: కర్ణాటకలో మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న JDS ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అర్ధరాత్రి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Karnataka Sex Scandal Accused Prajwal Revanna Arrested in Bengaluru

జర్మనీ నుంచి వచ్చిన ఆయన.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.

కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలసంఖ్యలో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. కర్ణాటకలోని హాసన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news