ఆ ఒక్కడి కోసం ఆగని వేట…!

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్ట్ ల కోసం వేట ఆగడం లేదు. కాగజ్ నగర్ మండలం కడంబ ఎన్ కౌంటర్ తర్వాత మూడో రోజు కొనసాగుతున్న కూంబింగ్… లో డ్రోన్ లను వాడుతున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట కొనసాగుతుంది. ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు పలు సూచనలు చేసారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ లతో జల్లెడ పడుతున్నాయి గ్రేహౌండ్ బలగాలు.

18 maoists in chhattisgarh surrendered to police
18 maoists in chhattisgarh surrendered to police

మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేల్లు అలియాస్ భాస్కర్ టార్గెట్ గా సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొలిక్కి రాలేదు. పెంచకల్ పెట్ (మ) సిద్దేశ్వర గుట్ట లోడ్పెల్లి చింతనమనేపల్లి గూడెం ప్రాణహిత నదీ సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు. ఈనెల 19న కదంబ అడవుల్లో ఎదురు కాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు.