సన్ రైజర్స్ కు బిగ్ షాక్…!

సన్ రైజర్స్ హైదరాబాద్ కి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ జట్టు నుంచి ఆ జట్టు కీలక ఆటగాడు దూరం అయ్యాడు. కెన్ విలియంసన్ జట్టుకి దూరం అయినట్టు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రకటన చేసాడు. “కేన్ విలియమ్సన్ ఆరోగ్యంగా లేడని డేవిడ్ వార్నర్ ప్రకటన చేసాడు. అతను ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు అని వివరించాడు. మాకు ఇద్దరు స్పిన్నర్ లు మాత్రమే ఉన్నారని అతను అన్నాడు.

నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయింది. చాహల్ తన స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. హైదరాబాద్ జట్టుకి చెందిన మరో ఆటగాడు కూడా గాయపడ్డాడు. జట్టు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడి నిన్న మ్యాచ్ కి దూరమయ్యాడు.