సామాన్యులకు మరో సారి భారీ షాక్ తగిలింది. మరో సారి రైల్వే స్టేషన్ లల్లోని ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్ లలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ. 50 అయింది. అయితే గతంలో ప్లాట్ ఫాం ధర కేవలం రూ. 10 మాత్రమే ఉండేది.
అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాకుండా.. ఇతర స్టేషన్ లలో రూ. 20 వరకు పెరిగింది. అయితే సంక్రాంతి పండుగ వల్ల పెరిగిన రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ప్లాట్ ఫాం ధరలు నేటి నుంచే అమలులో ఉంటాయని అధికారలు తెలిపారు. అయితే పెంచిన ప్లాట్ ఫాం ధరలు ఈ నెల 20 వరకు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.