తెలంగాణాలో ఆరెంజ్ అలెర్ట్… కీలక ఆదేశాలిచ్చిన సీఎస్..!

-

వేసవి కాలం రావడంతో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. అయితే రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాలులు కూడా ఎక్కువగా వుంటాయని తెలిపింది.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంది. అందుకే ప్రజలు ఎండల్లో బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఏప్రిల్‌ ఒకటి, రెండు తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు ఎక్కువవుతాయని చెప్పారు. రాజస్తాన్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణలోకి పొడిగాలులు వీస్తున్నాయని దీని వలన ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు.

ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కరిమెరిలో బుధవారం అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదు అయ్యింది. ఏప్రిల్‌లో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటుతుందని అంటున్నారు. చప్రాలా, జైనథ్‌లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో కూడా 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 41.4, రామగుండంలో 41.2, నల్గొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలానే నగర శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ప్రస్తుత ఉష్ణోగ్రతలు, తాగు నీటి సౌకర్యాలు, ఆరోగ్యశాఖ ద్వారా అందుబాటులో ఉన్న ఔషధాలు, సప్లిమెంటరీ ట్యాబ్లెట్లు, సిరప్‌లు, ఓరల్‌ రీ-హైడ్రేషన్‌ సొల్యూషన్‌ వంటివి ఎన్ని వున్నాయి అనేది అడిగి తెలుసుకున్నారు. అలానే ముందస్తు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news