తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..ఫ్రీ కోచింగ్ కోసం ప్రత్యేక యాప్

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే పోలీసు శాఖ ఫ్రీ కోచింగ్ పేరుతో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధం అయింది. అన్ని పోలీస్ డివిజన్ లోనూ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డిజిపి ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఇప్పుడు తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ సైతం అదే కోవలో చేరింది. బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగానే 50 వేల మందికి ఆఫ్లైన్, మరో 50 వేల మందికి ఆన్లైన్ లో శిక్షణ ఇవ్వనుంది.

ఇప్పటికే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా నిత్యం పోటీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నలు విడుదల చేస్తోంది బీసీ సంక్షేమ సంఘం. టెలిగ్రామ్ ద్వారా అవసరమైన మెటీరియల్ అందించేందుకు కూడా బీసీ సంక్షేమ శాఖ కసరత్తు పూర్తి చేసింది. అంతేకాదు మరో 15 రోజుల్లో బీసీ స్టడీ సర్కిల్ ఆన్లైన్ యాప్ ను కూడా అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

note :

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news