తెలంగాణ ప్రజలకు శుభవార్త.. పట్టణాల్లో నోటరీల ద్వారా కొనుగోళ్లు జరిగిన వ్యవసాయేతర ఆస్తుల రెగ్యులరైజేషన్ కు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు తో పాటు నోటరీ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు, ప్రాపర్టీ టాక్స్ రసీదు, కరెంటు, వాటర్ బిల్స్ తదితర పత్రాలను సమర్పించాలి. 125 గజాలలోపు స్థలం ఉంటే ఉచితంగా రెగ్యులర్లైజేషన్ చేస్తారు.
అంతకుమించి స్థలం అయితే మార్కెట్ రేటు ప్రకారం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ఇక అటు ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2014 కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్న వారికి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది సర్కార్.