BREAKING : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. ముంపు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…రేపు ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు.
కూనవరం మండలం కోతులగుట్ట గ్రామం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్… వరద ప్రభావం, తీసుకుంటున్న చర్యలను సమీక్షించనున్నారు.కూనవరంలో వరద బాధిత కుటుంబాలను కలిసి భరోసా ఇవ్వనున్నారు సీఎం జగన్. కాగా, గ్రామ, వార్డు వాలంటీర్ల గౌరవ వేతనాలను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచేందుకు సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా గౌరవ వేతనాల పెంపుపై ప్రకటన ఉండే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.30 లక్షల మంది వాలంటీర్లు… 2019 నుంచి నెలకు రూ. 5000 గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు.