వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించిన ఉస్మానియా యూనివ‌ర్సిటీ

తెలంగాణ‌లో ఇప్ప‌టికే స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కానీ యూన‌వ‌ర్సిటీల స్టూడెంట్ల ప‌రిస్థితి ఏంటా అని అంద‌రి డౌట్ క‌దా. ఇప్పుడు ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆ డౌట్ క్లారిఫై చేసింది. వేస‌వి సెల‌వుల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

మే5 నుంచి 31వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ క్యాంప‌స్ తో అనుబంధం ఉన్న కాలేజీల‌న్నింటికీ ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. స్టూడెంట్లు ఎవ్వ‌రూ క్యాంప‌స్ లో ఉండ‌కూడ‌ద‌ని సూచించింది. క‌రోనా తీవ్రంగా ఉన్నందున స్టూడెంట్లు హాస్ట‌ళ్ల‌ను ఖాళీ చేయాల‌ని కోరింది.