రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే నేను చెప్పానని తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను చేయండి. కానీ డిసెంబర్3న మాత్రం పండగ వాతావరణం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయి. టీఆర్ఎస్ కంటే ఒకటి ఎక్కువ రావాలని అనుకున్నాం.
కానీ రాకెట్ సైన్స్ ఏం లేదు.. సీఎం రేవంత్ అవుతాడు. తన ప్రాణం పెట్టి కొట్లాడారు రేవంత్. డిసెంబర్7 సాయంత్రం lb స్టేడియం లో పడుకుంటా.. నువ్వు కూడా రా..ఇంటర్వ్యూ చేయాలి. దుప్పటి కూడా రెడీ చేసుకున్న. మంచం కూడా తీసుకు పోదాం అనుకున్న. మాక్ వాడు వద్దు అన్నారు. డిసెంబర్ 9 చప్పట్లు కొడుతూ ఉంటా.. రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం ఖాయమని తన మనసులోని మాటను బయటపెట్టాడు బండ్ల గణేష్.