పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు పాతిక లక్షల నగదు బహుమతి : రేవంత్ రెడ్డి

-

శిల్పాకళా వేదికలో పద్మ అవార్డుల గ్రహీతను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సత్కారం చేసే కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. . గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూలల ప్రాంతాల్లో పెరిగి స్థానిక కళలను మార్చుకొని అందులోనే తమ జీవితాన్ని గడిపిన దాసరి కొండప్ప, ఆనందచారి, ఉమా మహేశ్వరి, సోమ్ లాల్, విఠాలాచారి లకు కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తించి పద్మ శ్రీ అవార్డులను అందజేసింది.  తెలంగాణ ప్రభుత్వం  కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తోంది అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. మనవాళ్లే. పద్మ శ్రీ అవార్డు అవార్డు గ్రహీతలకు చప్పట్లు, దుప్పట్లు కాదు.. నగదు బహుమతి కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పద్మ శ్రీ అవార్డు గ్రహీతకు రూ.25లక్షల నగదు బహుమతి తో పాటు వారికి నెలకు రూ.25 పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దేశానికి రాష్ట్రపతి అవుతారని భావించాను..ఈ దేశానికి రాష్ట్రపతికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అవకాశం లభిస్తుందని భావిస్తున్నానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.  ఢిల్లీలో తెలుగు నాయకత్వం తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. వచ్చే ఎంపి ఎన్నికల్లో మంచి నాయకులను ప్రజలు ఎన్నుకోవాలి

Read more RELATED
Recommended to you

Latest news