తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ పోయి వెంటిలేటర్ మీదున్న రోగి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. దీనికి సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయ్. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరెంట్ పోయి వెంటిలేటర్ మీదున్న రోగి మృతి చెందాడు.

వరంగల్ – ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి నుండి విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బిక్షపతి(45) అనే వ్యక్తి మృతి చెందాడు.కరెంట్ పోవడంతో జనరేటర్ ఆన్ చేయగా అది పని చేయలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వెంటిలేటర్ ఆఫ్ అయి బిక్షపతి మృతి చెందాడు. ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.