కాంగ్రెస్‌ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి భార్య?

-

కాంగ్రెస్‌ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మహేందర్‌ రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతా రెడ్డి తెలిపారు.

Patnam Mahender Reddy’s wife as Congress Chevella MP candidate

దిల్లీ లేదా హైదరాబాద్‌ వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక ఇందులో భాగంగానే…శాసన మండలి సమావేశాలకు దూరంగా ఉండనున్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. నిన్న సిఎం రేవంత్ ను కలిసిన పట్నం మహేందర్ రెడ్డి,సునీత మహేందర్ రెడ్డి…త్వరలో కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. రెండు, మూడు రోజుల్లో రాహుల్ గాంధీని కలవనున్నారు పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబం. అటు చేవెళ్ల పార్లమెంట్ అవకాశం పట్నం సునీత మహేందర్ రెడ్డి కి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version