కేటీఆర్ ముందు మోడీ – అమిత్ షా లను ఓడించిన పవన్!

-

ప్రస్తుతం అటు బీజేపీ ఇటు తెరాసల మధ్య విపరీతంగా నలిగిపోతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న పరిస్థితి ఎదురైన్నప్పటికీ… వ్యూహాత్మకంగా చంద్రబాబు అలవాటుచేసిన రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. ఫలితంగా ఒకరికి ఒక చోట మరొకరికి మరో చోటా ఓకే అన్నారంట!

అవును… పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా లేక ఏపీ బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నారా? మిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదిది! సో.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ పోటీచేసినా జనసేన మద్దతివ్వాలి, పవన్ ప్రచారం చేయాలి! కానీ.. ఏపీలో వీర్రాజు కోసం పని చేస్తాను కానీ తెలంగాణలో సంజయ్ కు సారీ అంటున్నారంట పవన్ కల్యాణ్! ఇందుకు కారణం తెరాస నేతల ఒత్తిడి, సినిమా వాళ్ల ఒత్తిడే కారణం అని తెలుస్తోంది!

అవును… ఏపీలో 2024 ఎన్నికల అనంతరం బీజేపీ-జనసేన ల ఉమ్మడి అభ్యర్థే సీఎం అవుతారని చెప్పి జనసేనకు ఎంతో విలువిచ్చింది బీజేపీ! అయితే ఈ విషయంలో తెలంగాణలో మాత్రం బీజేపీకి బహిరంగంగా మద్దతిచ్చే పరిస్థితి కన్పించడం లేదని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది! కారణం… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ‌్ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం!!

ఇందుకు ప్రధాన కారణం అధికార తెరాస విషయంలో సినిమా ఇండ్రస్ట్రీ మొత్తం వారికి అనుకూలంగా ఉంది. పైగా గ్రేటర్ ఎన్నికలను కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో సినిమా ఇండ్రస్ట్రీ నుంచి తెరాసకు వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పే అవకాశం లేదు. దీంతో… పవన్ కూడా అలాంటి పని చేయకూడదని ఒత్తిడి వచ్చిందని తెలుస్తోంది!

మరి ఈ విషయంలో ఏపీలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట పవన్ మాట్లాడతారా లేక, గ్రేటర్ అన్నికల సమయానికి షూటింగుల్లో బిజీ అయిపోయి కనుమరుగైపోతారా అన్నది వేచి చూడాలి! ఏది ఏమైనా… కేటీఆర్ ముందు బండి సంజయ్, మోడీ, అమిత్ షా లు పవన్ విషయంలో ఓడిపోయినట్లే!!

Read more RELATED
Recommended to you

Latest news