కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Pawan Kalyan visited Kondagattu Anjanani

పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, పార్టీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి కార్యాకర్తలు తరలివచ్చారు. ఇక అంతకు ముందు కొండగట్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్‌కు గజ మాలతో స్వాగతం పలికారు జనసేన పార్టీ నేతలు, అభిమానులు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనంగా గజమాలతో సన్మానం పలికారు.

అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరి…స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక అటు జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీ గా ఉండనున్నారు. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశంలో .ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news