హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో పెద్ద సమస్య ఏంటంటే.. కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమంత్రులున్నారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలో లేదు. కోరిది ఒక్కటే.. పార్టీ తరపున నిలబడిన వ్యక్తినే కాదు..పార్టీ వైఖరీ, పార్టీ తత్వం.. పార్టీ వెనుక ఉన్న నాయకుడు ఎవరు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని.. నేతలు కాదని పేర్కొన్నారు కేసీఆర్. ప్రజల గెలుపే ప్రజాస్వామ్య విజయం కావాలని చెప్పారు. కళ్ల ముందు జరిగిన చరిత్రను కొందరూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇస్తామని నమ్మించి మనతో పొత్తు పొట్టుకున్నారు. మాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎప్పుడూ కొట్లాడలేదని పేర్కొన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించలేదు. రైతుబంధు గురించి కాంగ్రెస్ నాయకులు వద్దు అంటున్నారు. రైతు బంధు వద్దంటే రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతుబంధు, దళిత బంధు రాదన్నారు. ధరణిని తీసేయాలి అంటున్నారు అసలు ఆ ధరణి ఎందుకోసం తెచ్చామో తెలుసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.