కేసీఆర్ కి హరీష్ రావు వెన్ను పోటు పొడుస్తారు : పేర్ని నాని

-

చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్లు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీష్ రావు అల్లుడు, ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. హరీష్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు. ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. కానీ  కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి.. అల్లుడి గిల్లుడికి సమాధానం ఇస్తాడు అని  తెలిపాడు పేర్నినాని.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ కు వావి వరసలు లేవు. బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. కృష్ణా జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న ఊర్లలోనే ఎందుకు వారాహి యాత్ర చేస్తున్నాడు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే చోట్ల ఎందుకు మీటింగ్ లు పెట్టడం లేదు అని ఆయన ప్రశ్నించారు. మా అందరి కంటే ప్రజలు తెలివైన వాళ్ళు. వాళ్లకు అన్ని తెలుసు  అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news