ఇంత మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమ్మవారిగా, దేవతగా కొలుస్తూ.. సమ్మక్క, సారక్కలుగా దేవత అని పూజిస్తాం.. వరాలు పొందుతాం.. అటువంటి సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ కార్యకర్తగా గర్వపడుతున్నాను.  చాలా ఏండ్ల నుంచి పోరాటాలు చేశారు.  తెలంగాణలో చాలా ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నారు.  తెలంగాణ రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు ప్రధాని మంత్రి. 

దేశంలో ఎక్కడ లేని విధంగా త్యాగాలు, పోరాటాలు, బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏ రకమైన ప్రభుత్వం ఉందో ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దరిద్రపు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంత మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు అన్నారు. అధికారంలో మాత్రమే ఉండాలి. తెలంగాణ మేలు పట్ల ఈ ముఖ్యమంత్రికి తీరిక లేదు. కొడుకును ఎలా సీఎం చేయాలని ఆలోచించడం తప్ప.. చేసింది ఏం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేయకూడదు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పంపించాలన్నారు కేంద్ర మంత్రి కేటీఆర్.