కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లింగ వివక్షకు దారితీస్తున్న జీవో 47 ను కొట్టివేయాలని నాగోల్ కు చెందిన ఉద్యోగి హరేందర్ కోటును ఆశ్రయించారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో మహిళలు పోటెత్తడంతో టికెట్ కొన్న పురుషులకు సీటు దొరకట్లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది.
కాగా, తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చింది. డిసెంబర్ మాసం 9వ తేదీన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. అయితే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అయ్యాయి.