Suryakumar Yadav : టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ జరిగింది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేశారు. అతిత్వరలో కోలుకొని తాను తిరిగి వస్తానని ట్విట్ చేశారు. సూర్య గత కొంతకాలంగా చీలమండ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా… అయితే ఈ సర్జరీ నేపథ్యంలో టీమిండియా 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దేశవాళితోపాటు ఐపీఎల్లో పలు మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ లో జరగబోయే టి20 ప్రపంచకప్ నాటికి సూర్య అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రెండేళ్ల కిందట టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా ఈ సమస్యతో బాధపడ్డాడు. 2002 జూలైలో సర్జరీ చేయించుకొని మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతున్నాడు.