కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాంబ్ పేల్చారు. అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో కాక రేపుతోంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు వీర విధేయుడిలా ఉన్న పోచారం అనూహ్యంగా గులాబీ బాస్ కి షాక్ ఇచ్చారు. పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డితో కలిసి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో పోచారంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు వివిధ పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాంబ్ పేల్చారు. పోచారం చేరిక అవకాశ వాదం కు నిదర్శనమని.. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసామన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..ఇతర పార్టీల నేతలను చేర్చుకోవద్దని కోరారు.