న్యూ ఇయర్‌ వేడుకలకు డ్రగ్స్‌.. ఎల్బీనగర్‌లో ముఠా అరెస్ట్‌

-

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ నిఘా ఉంచి డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడికక్కడ డ్రగ్స్ సరఫరాను అరికడుతోంది.

ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా ఉంటుందని భావించిన పోలీసులు హైదరాబాద్‌లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో డ్రగ్స్ ముఠాను ఎస్‌వోటీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.

ముందస్తు సమాచారం ప్రకారం నిఘా ఉంచి మరి ముఠాను పట్టుకున్నారు. వారు రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్‌, రూ.10వేలు, ఒక బైక్‌, 3 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news