తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి గతంలో ఎస్సీ అలాగే ఎస్టీలకు 30 శాతం మార్కులు ఉండగా… బీసీలకు 30 శాతం ఇతరులకు 40 శాతం మార్కులు అర్హతగా పరిగణించేవారు. అయితే ఈసారి ఈ మార్కుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ పోలీస్ శాఖ.
ఈ సారి అందరికీ 30 శాతం మార్కులను అర్హతగా తీసుకుంటున్నట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ వి వి శ్రీనివాసరావు ప్రకటన చేశారు. అయితే ఈ సారి నెగిటివ్ మార్కింగ్ వల్ల సమాధానాలు ఊహించి పెట్టవద్దని ఆయన సూచనలు చేశారు. అభ్యర్థులు 60 సరైన ఆన్సర్ లు గుర్తిస్తే అర్హత సాధిస్తారని… స్పష్టం చేశారు వి.శ్రీనివాసరావు. అర్హులైన అభ్యర్థులు అందరూ పోలీసులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలి అని సూచనలు చేశారు.