ఈ స్కూటర్ ని బ్యాగ్ లో కూడా పెట్టేయచ్చు తెలుసా..?

-

ఈ మధ్య కాలి నడకన వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా టూ వీలర్ ని కానీ ఫోర్ వీలర్ ని కానీ వాడుతున్నారు. అయితే ఈ స్కూటర్ మాత్రం ఎంతో వెరైటీ. అలానే మీరు దీనిని పార్క్ చేయడానికి స్థలం కోసం కూడా చూడక్కర్లేదు. మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మీ బ్యాగ్‌లో కూడా పెట్టేసుకోచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

పోయమో యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ కలయిక. పెట్రోల్ తో కూడా పని లేదు. పోయమో నుండి వ‌చ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5.5 కిలోల బరువు ఉంటుంది. వైర్‌లెస్ పవర్ సిస్టమ్‌ ఉపయోగించింది.స్కూటర్‌పై కూర్చున్న వ్యక్తి దానిని సులభంగా నడపచ్చు.

ఇందులో సాఫ్ట్ రోబోటిక్ టెక్నాలజీని వాడారు. ఇది ఎంతో మృదువుగా, సురక్షితంగా, తేలికగా ఉంటుంది. దీని బాడీ ని థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్‌తో తయారు చేశారు. ముందు, వెనుక చక్రాలు, బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్, హ్యాండిల్ బార్ మరియు వైర్‌లెస్ కంట్రోలర్‌లు కలిగి వుంది ఇది.

స్కూటర్ నడపడానికి ముందు ఎయిర్ ని ఫిల్ చెయ్యాల్సి ఉంటుంది. వెనుక భాగంలో వాల్వ్ ఉంది, దాని నుండి మీరు దాని గాలిని బయటకు తీసి బ్యాగ్ లో పెట్టేసుకోచ్చు. మార్కెట్ లోకి అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news