హైదరాబాద్ లో ఒక “మోస్ట్ వాంటెడ్” దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19 లక్షలు అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ళను గుర్తించి అతను దొంగతనాలు చేస్తున్నాడు అని హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ టీం, మోస్ట్ వాంటెడ్ దొంగలను పట్టుకున్నారు అని చెప్పారు.
8 మంది టీంతో దొంగతనాలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. పోలీసులు 35 గ్రాముల బంగారం… 17 లక్షల గురించి నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముగ్గురిలో ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు అంజని కుమార్ తెలిపారు. మరో నిందితుడు షకీల్ పరారీలో ఉన్నాడు. నిందితుడు నేనావత్ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలానికి చెందినవాడు అని చెప్పారు.