ష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా.. ఇప్పటి వరకు రూ.48.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. అందులో శనివారం ఒక్క రోజే రూ.21 కోట్లకు పైగా పట్టుబడింది. రూ.21 కోట్లలో ఆదాయపు పన్ను శాఖ రూ.15.51 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా.. సుమారు రూ.3 కోట్లు పట్టుబడింది. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి నగదు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. వాహన తనిఖీలు చేస్తుండగా.. 6,90,000 నగదు పట్టుబడింది. దీనికి సంబంధించి సదరు వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో నగదు జప్తు చేసి ఎన్నికల వ్యయ పరిశీలన కమిటీకి అప్పగించారు.