అప్సర మర్డర్ కేసు.. సాయికృష్ణ కస్టడీకి నేడు పోలీసుల పిటిషన్‌

-

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ.. రాజేంద్రనగర్‌లోని న్యాయస్థానంలో శంషాబాద్‌ పోలీసులు…. కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజు సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లే  అప్సరకు సాయికృష్ణ వల వేశాడని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. పరిచయంతో మొదలై.. వారి బంధం.. వివాహేతర సంబంధానికి దారి తీసిందని.. ఈ క్రమంలోనే అప్సర గర్భవతి అని తెలిసిందని చెప్పారు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిశాక.. పెళ్లి చేసుకోవాలంటూ సాయికృష్ణపై ఒత్తిడి చేసిందని.. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని సాయికృష్ణ ప్రయత్నం చేసినా యువతి పట్టువీడకపోవడంతో…  మూడు నెలల క్రితమే చంపాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. అదను కోసం ఎదురుచూసిన సాయికృష్ణ… ఈ నెల 4న పథకాన్ని అమలుచేశాడని రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news