పోలీస్ ,వైద్య ,ఆరోగ్యశాఖలో నియమాకలపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో వెంటనే పోలీస్ నియామకాల ప్రక్రియను చేపట్టాలని ఆదేశించాడు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డిజిపి రవి గుప్తా,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరియు పలువురు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా మరియు అవకతవ్కలు జరగకుండా చేపట్టాలని ఆదేశించాడు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన నియామకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పాడు. పోలీస్ శాఖలో గత 8 ఏళ్లుగా హోంగార్డ్ నియామకాలు లేవని , వారి యొక్క సేవలు మరింత సమర్థవంతంగా ఉపయోగించుటకై ఈ నియామకాలు చేపట్టాలని అన్నాడు. హోంగార్డ్ ల ఆర్థిక ,వైద్య ,ఆరోగ్య అవసరాలు తీరేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం డీజీపీ ని ఆదేశించాడు.