కుల గణన సర్వే పేరుతో రాజకీయ సర్వే..!

-

కుల గణన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బందిపై  ఉత్తర్వులు జారీ చేసింది. కుల గణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్లు పాల్గొంటారని తెలిపింది. అంతేకాకుండా… 6256 మంది ఎంఆర్‌సీలు, 2 వేల మంది మినిస్టీరియల్‌ సిబ్బంది కూడా భాగం కానున్నారు. ఈ కుల గణన సర్వే నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు మినహాయింపు ఇచ్చారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు… ఆదివారమే కాకుండా… సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తం మూడు వారాల పాటు ఈ సర్వే జరగనుంది.

అయితే కుల గణన సర్వే పేరుతో రాజకీయ సర్వే నిర్వహించారు. కులగణన సర్వే ప్రశ్నాపత్రంలో ఇంటి సభ్యుల రాజకీయ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధిగా పని చేసిన వివరాలు అంటూ ఓ కాలమ్ దర్శనమిస్తుంది. అందులో ప్రజా ప్రతినిధిగా సభ్యత్వం.. ఆఫీస్ బేరర్, మినిస్టర్, చైర్మన్, స్పీకర్ తదితర పదవీలు.. అలాగే ఎన్ని టర్మ్ లు అనే ఆప్షన్ ఉండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news