పాలిటిక్నిక్ పేప‌ర్ లీక్.. ప‌రీక్షలను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

-

పాలిటిక్నిక్ పేప‌ర్ లీక్ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. లీకైన రెండు ప‌రీక్షల‌ను ర‌ద్దు చేస్తు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 8, 9 తేదీల‌లో జ‌రిగిన పరీక్షలు లీక్ కావ‌డంతో ఈ రెండు ప‌రీక్షల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఈ తేదీల‌లో నిర్వ‌హించిన ప‌రీక్షల‌ను తిరిగి ఇదే నెల 15, 16 తేదీల‌లో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగ ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని బాట సింగారంలో ఉన్న స్వాతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి పాలిటిక్నిక్ ఫైన‌ల్ ఇయ‌ర్ ప్ర‌శ్నా ప‌త్రాలు లీక్ అయిన‌ట్టు బోర్డుకు స‌మాచారం అందింది.

అలాగే ప్ర‌శ్నా ప‌త్రాల లీక్ అంశంపై ఇత‌ర జిల్లాల ప్రిన్సిపాల్స్ కూడా బోర్డుకు స‌మాచారం అందించారు. వాట్స‌ప్ ద్వారా ప్ర‌శ్నా ప‌త్రాలు లీక్ అయిన‌ట్టు తెలుస్తుంది. కాగ ప‌శ్నా ప‌త్రాల లీక్ అంశంపై పోలీసులు రంగంలోకి దిగారు. విచార‌ణ ప్రారంభించారు. కాగ పాలిటెక్నిక్ ఫైనల్ ఇయార్ ప‌రీక్షలు ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. కాగ మొదటి రెండు రోజుల్లో జ‌రిగిన పేప‌ర్లే లీక్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news