తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

-

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని చెప్పారు. పోలింగ్ శాతం కొంచెం పెరగొచ్చని ఆయన వెల్లడించారు.

- Advertisement -
Polling percentage across Telangana was recorded as 70.79%

నిన్న రాత్రి 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి కచ్చితమైన పోలింగ్ వివరాలు అందడం వల్లే పూర్తి స్థాయి పోలింగ్ శాతం రాలేదని వివరించారు సీఈఓ వికాస్ రాజ్. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.79 శాతం నమోదు అయినట్లు వివరించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు 91.5, యాకత్ పురలో 39.6% పోలింగ్ జరిగిందన్నారు. మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉందని….40 కంపెనీల కేంద్ర రక్షణ బలగాలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...