తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..స్కూళ్లకు 5 రోజులు సంక్రాంతి సెలవులు

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. 14లో బోగి, 15న సంక్రాంతి మరియు 16న కనుమ పండుగ ఉండగా 17వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి 18వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయి.

మొత్తం ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అటు తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 13వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలుకానున్నాయి. అయితే కాలేజీ విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. అంటే ఈ నెల 16వ తేదీన విద్యార్థులు తిరిగి కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news