పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్ అంటూ కొమురవెల్లిలో భక్తుల నినాదాలు

-

Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. మంత్రి పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్ అంటూ కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు నినాదాలు చేశారు. సిద్దిపేట – కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇదే రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

Ponnam Prabhakar down down is the slogan of the devotees in Komuravelli

స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయ వర్గాలు దర్శనాల క్యూలైన్‌లను నిలిపివేశారు. మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులు అసహనానికి గురవడంతో, మంత్రిని చూసి భక్తులు ‘మినిస్టర్’ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news