న్యూయార్క్ టైంస్క్వేర్ వద్ద రాజీవ్‌గాంధీకి మంత్రి పొన్నం నివాళులు

-

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇన్నాళ్లూ బిజీబిజీగా ఉండి.. కుటుంబంతో సమయం గడపలేకపోయిన ఆయన.. పోలింగ్ జరిగిన తర్వాత యూఎస్కు వెళ్లారు. అక్కడ న్యూయార్క్ వీధుల్లో తన కుటుంబంతో కలిసి విహరిస్తున్నారు. అయితే ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా ఆయన అగ్రరాజ్యంలో రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్  వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళర్పించారు. దిల్లీ నుంచి పల్లె వరకు నిధులను తీసుకురావటానికి కార్యాచరణను తీసుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్‌ అని కొనియాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడటానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతిత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news