నేటితో ముగియనున్న పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియ

-

పోస్టల్ ఓటింగ్‌ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఎన్నికల విధుల్లో ఉన్న 2 లక్షల 64 వేల 43 మంది  పోస్టల్ ఓటింగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సుమారు లక్ష 76 వేల మంది నిన్నటి వరకు ఓటు వేశారు. సర్వీసు ఓటర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సర్వీసు ఓటర్లు 15 వేల 970 మందికి ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ లు పంపించగా.. 170 మాత్రమే రిటర్నింగ్ అధికారులకు తిరిగి వచ్చాయి. ఇంటి నుంచి ఓటింగు ప్రక్రియ పూర్తయింది.

దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచి ఓటు వేసేందుకు 23 వేల 247 మందికి ఈసీ అనుమతినిచ్చింది. వారిలో  21 వేల 651  మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 301 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. 8 వేల 481 కేసులు నమోదు చేసినట్లు సీఈవో కార్యాలయం తెలిపింది. సువిధ పోర్టల్ ద్వారా 10 వేల 465 అనుమతులు ఇచ్చినట్లు… రాజకీయ పార్టీలు, అభ్యర్తులకు సంబంధించిన 324 ప్రకటనలకు ఆమోద ముద్ర వేసినట్లు సీఈవో కార్యాలయం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version