సోనియా గాంధీని తిడుతూ…రేవంత్ రెడ్డి ఫొటోతో పోస్టర్లు కలకలం !

-

బంజారాహిల్స్ లో మరోసారి రేవంత్ రెడ్డి ఫొటో తో పోస్టర్లు కలకలం రేపాయి. సోనియాగాంధీని బలి దేవత అని రాహుల్ గాంధీని ముద్దపప్పు అని గతంలో అన్న మాటలు పోస్టర్ రూపంలో రేవంత్ రెడ్డి ఫొటో తో పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ వెలిసిన పోస్టర్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇదంతా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల పనేనని కాంగ్రెస్‌ పార్టీ నేతలు, రేవంత్‌ రెడ్డి వర్గం సీరియస్‌ అవుతోంది.

revanth reddy

ఇక ఇవాళ తుక్కుగూడ లో కాంగ్రెస్ విజయభేరి సభ జరుగనుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్ సిటీ సమీపంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా యువ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సిడబ్ల్యుసి ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు, డిసిసిలు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానుండటంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version