ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఉదయం 11 గంటలకు నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని జాతీయ పథకాన్ని ఎగరవేస్తారు. అసెంబ్లీ మండలిలో కూడా జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించనున్నారు.
ఇక ఇవాళ తుక్కుగూడ లో కాంగ్రెస్ విజయభేరి సభ జరుగనుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్ సిటీ సమీపంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా యువ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సిడబ్ల్యుసి ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు, డిసిసిలు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానుండటంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.