పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకోం.. రామగుండం నేతలకు కేటీఆర్ వార్నింగ్

-

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది. ముఖ్యంగా పలు పార్టీల నేతల మధఅయ విభేదాలు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇక బీఆర్ఎస్​లో ఉన్న అంతర్గత విభేదాలు కాస్తా.. ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. పరస్పరం బహిరంగంగా ఆరోపించుకుంటూ పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యంగా రామగుండం నేతలను ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు అందరూ సమానమేనని.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై విమర్శలు కురిపించిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చర్చించారు. ఒక్కొక్కరిని అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చందర్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. కేసులు పెట్టి వేధిస్తున్నారని రామగుండం నేతలు కేటీఆర్‌కు తెలిపారు. ఏదైనా ఉంటే మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు. రామగుండంలో సమస్య దాదాపు పరిష్కారమైనట్లేనని మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news