సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ సమావేశం..ఆ పార్టీకి షాక్ !

నిన్న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్… సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనతో చర్చలు జరపాలని రాత్రి కూడా ప్రగతి భవన్ లోనే ప్రశాంత్ కిషోర్ బస చేసినట్లు సమాచారం అందుతోంది. దైవాల మరోసారి భేటీ అవుతారని… పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం అందుతోంది.

అయితే శనివారం సీఎం కేసీఆర్ తో సమావేశమైన తర్వాత ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందే చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తోనే కలిసి పని చేస్తానని… శాంతి కిషోర్ స్పష్టం చేసినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపుల గురించి కూడా సీఎం కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తో వరుసగా చర్చలు జరుగుతున్న ప్రశాంత్ కిషోర్… ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ ను కలవడం టిఆర్ఎస్ తో పని చేస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.