అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దమ్మున్న నాయకుడు ప్రధాని మోడీ మాత్రమే : ఈటెల రాజేందర్

-

అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు ప్రధాని మోడీ మాత్రమే అన్నారు మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వీబీఆర్ గార్డెన్స్, అల్వాల్‌లో ఎస్సీ మోర్చా మీటింగులో పాల్గొని ప్రసంగించారు. రిజర్వేషన్ అంశంపై భాద్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి బీజేపీ పార్టీపై అకారణంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం. అంబేద్కర్ గారు దేశంలోని దళిత జాతుల జీవన స్థితగతుల గురించి, వారు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితుల విషయంలో లండన్‌లో స్వతంత్య్రానికి పూర్వమే వేదికలపై ప్రసంగించారు.

స్వాతంత్య్రానంతరం వారికి రిజర్వేషన్లు ఉండాలని, లేకపోతే సమాజంలో కలిసి ఉండే పరిస్థితులు ఉండవని భావించి, రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచారు అంబేద్కర్ గారు. అంతేతప్ప కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్లకు ఏమాత్రం సంబంధం లేదు. అంతకు పూర్వమే సాహు మహరాజ్ కూడా నిమ్నకులాలు, అణగారిన వర్గాల గురించి పోరాటాలు చేశారు.

గతంలో ఓబీసీలకు రిజర్వేషన్ ఉండేది కాదు. అనంతరం 1962 తర్వాత అనేక కమిటీలు ఏర్పాటు చేసి, వారికి కూడా రిజర్వేషన్లు కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండకూడదని వాదించేవారు. దానికి సంబంధించిన రుజువులు కూడా నా వద్ద ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. దానికి బీజేపీని ఈ విషయంలో విమర్శించే హక్కు లేదు.

 

కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అబద్దపు ప్రచాారాలు చేస్తోంది. గతంలో బీజేపీ ప్రధానులు ఎవ్వరూ కూడా రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పలేదు. నరేంద్రమోదీ కూడా 10 ఏళ్లుగా ప్రధానిగా ఉండి ఏనాడూ రిజర్వేషన్లు తీసేస్తామని ప్రకటించలేదు. అనేక ఇతర కులాలను కూడా ఓబీసీలలో చేర్చింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి కూడా రిజర్వేషన్లు ప్రకటించిన ఘనత నరేంద్రమోదీదే.

రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, మన్‌మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న కాలంలో ఎన్నడూ ఓబీసీలు గానీ, దళితులు గానీ మంత్రివర్గంలో లేరు. కేవలం ప్రధాని నరేంద్రమోదీ కాలంలోనే అనేకమంది దళితులు, ఓబీసీలు, మహిళలు మంత్రులుగా పెద్ద హోదాలో ఉన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదే. కేవలం అబద్దపు ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. వాజపేయిగారు ప్రధానిగా ఉన్న కాలంలోనే మైనారిటీలకు చెందిన మేధావి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేశారు. నరేంద్రమోదీ కూడా రాష్ట్రపతిగా దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను, అనంతరం ఆదివాసీ స్త్రీ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేశారు.

అలాంటి ప్రధాని నరేంద్రమోదీని ఎంతగానో విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశం తిరోగమిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ దశాబ్దాలుగా లేని అభివృద్ధి కేవలం మోదీ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో భారత దేశం సాధించింది. అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదంతో ఎన్నో వస్తువులు దేశంలో తయారవుతున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకునే భారత్ నేడు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది.

మోదీకి ఎందుకు ఓటు వేయాలో నేడు ప్రశాంతంగా నిద్రపోతున్న కాశ్మీర్ ప్రజలను అడగండి, మన సైనికులను అడగండి, మన పల్లెలలో స్వచ్ఛ భారత్ పధకం కింద 12 కోట్ల టాయిలెట్లు పొందిన మహిళలను అడగండి చెప్తారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్న చిన్న చిన్న వ్యాపారులను అడగండి, కరోనా కాలంలో ఉచితంగా వ్యాక్సిన్లు పొందిన ప్రజలను అడగండి చెప్తారు. మొట్టమొదటి సారిగా తెలంగాణ గడ్డ మీద అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది బీజేపీ. మొదటి సారిగా మల్కాజ్‌గిరిలో కాషాయ జెండా ఎగురబోతోంది.వార్డు మెంబరు నుండి ఎంపీ స్థాయికి ఎదగాలని కలలు కన్న కార్యకర్తల, నాయకుల ఆశలు నేడు ఫలించబోతున్నాయి. అందరూ పొరపొచ్చాలు, బేధాభిప్రాయాలు పక్కన పెట్టి కలిసి కట్టుగా పని చేయాలని కోరుతున్నాను.

 

Read more RELATED
Recommended to you

Latest news