ఒక్క రోజులో రికార్డు స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ కి లాభం

-

న‌ష్టాల‌లో కురుకు పోతున్న తెలంగాణ ఆర్టీసీ కి ఒక్క రోజు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి తో పాటు డిజిల్ ధ‌రలు విప‌రీతం గా పెర‌గ‌డం తో గ‌త మూడు సంవ‌త్స‌రాల నుంచి విప‌రీత‌మైన న‌ష్టాలు వస్తున్నాయి. కాని మంగ‌ళ వారం టీఎస్ ఆర్టీసీ కి గ‌తం లో ఎన్న‌డూ లేని విధంగా గరిష్ట స్థాయి లో లాభాలు వ‌చ్చాయి.

మంగ‌ళ వారం ఒక్క రోజు లో నే రూ. 14,06 కోట్ల ను వ‌సూల్ చేసి టీఎస్ ఆర్టీసీ కి ఊర‌ట క‌లిగించింది. అలాగే అత్య‌ధికంగా ఆక్యూపెన్సీ ని కూడా న‌మోదు చేసింది. ఈ ఒక్క రోజు లో 77.06 శాతం ఆక్యూపెన్సీ న‌మోదు అయింది. కాగ ఇంత లా ఆక్యూపెన్సీ గ‌తంలో ఎప్పుడూ కాలేదు. దీంతో ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌యం లేకుండా ఆర్టీసీ బ‌స్సు ల‌లో ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం పెళ్లిల సిజ‌న్ కావడం కూడా టీఎస్ ఆర్టీసీ కి క‌లిసోచ్చే అంశం అని చెప్పాలి. కాగ టీఎస్ ఆర్టీసీ ఎండీ గా స‌జ్జ‌న‌ర్ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఆర్టీసీ ని లాభాల బాట లో న‌డిపించ డానికి చాలా క‌ష్ట ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news