అభినందన్ కూల్చింది మా విమానం కాదు… పాకిస్థాన్ అదే తీరు.

-

బాలాకోట్ హీరో అభినందన్ వర్థమాన్ కూల్చింది మా విమానం కాదంటూ పాకిస్థాన్ మరోసారి బుకాయించింది. 2019 పాకిస్థాన్ లోని బాలాకోట్ లోని ఉగ్రవాదుల శిబిరాలను ఎయిర్ స్ట్రైక్ ద్వారా భారత్ దాడి చేసింది. అయితే దాడులు జరిగిన తర్వాత రోజు పాకిస్థాన్ తమ ఎఫ్ -16 విమానాలతో భారత్ పై దాడులు చేసేందకు ప్రయత్నించిది. ఈ దాడులను ప్రతిఘటించేందుకు అప్పటి వింగ్ కమాండర్, ప్రస్తుతం గ్రూప్ కాప్టెన్ అభినందన్ వర్థమాన్ ప్రతిదాడులు చేశారు. అయితే ఈ పోరాటంలో అభినందన్ అద్భుత నైపుణ్యంతో తన పాత మిగ్ బైసాన్ విమానంతో, పాకిస్థాన్ ఎంతో అధునాతమైన ఎఫ్ -16 విమానాన్ని కూల్చేశాడు. ఆ తరువాత అభినందర్ విమానానికి కూడా ప్రమాదం జరగడం.. ఆతరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దిగడం… పాకిస్థాన్ పట్టుకోవడం.. తిరిగి భారత్ కు అప్పగించడం అంతా తెలిసింది.

అయితే ఇప్పటికీ పాకిస్థాన్ తన తీరును మార్చుకోవడం లేదు. అబద్దాలు చెబుతూనే ఉంది. తాజాగా అభినందన్ తమ విమానాన్ని కూల్చనే లేదని బుకాయిస్తోంది. ఎఫ్ -16 విమానాన్ని భారత్ కూల్చిందని చెబితే పరువు పోతుందని.. ఇలా చెబుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా అభినందన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీర్ చక్ర ప్రకటించి, సత్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news