అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదు: రాహుల్‌గాంధీ

-

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్‌ జోడో యాత్ర సమయంలో చూశానని చెప్పారు. ఆ పార్టీని ప్రశ్నించినందుకు తనపై 24 కేసులు పెట్టారని ఆరోపించారు. దిల్లీలో ఎంపీల నివాసం నుంచి వెళ్లగొట్టారని.. అయినా తాను బాధపడలేదని.. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటికి వచ్చానని రాహుల్ చెప్పారు.

“ఈడీ విచారణ అని చెప్పిన నన్ను గంటలకొద్దీ కూర్చోబెట్టారు. ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుంది. బీజేపీ చెప్పిన చోటనే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే టీమ్‌, కలిసి పని చేస్తారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్​ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్​కు ఓటు వేస్తే.. మళ్లీ దొరల సర్కార్‌ వస్తుంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే… ప్రజల సర్కార్‌ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి జరింగి.” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news