YSR అభిమానులు సీఎం కేసీఆర్ కే ఓటు వేయండి – వైసీపీ పార్టీ ?

-

YSR అభిమానులు సీఎం కేసీఆర్ కే ఓటు వేయండి అంటూ వైసీపీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. వైయస్ఆర్ సీఎం గా వున్నప్పుడు ఉతికి అరేశా అంటూ నిన్న రేవంత్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్‌ రెడ్డి… ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే…సీఎం పదవి అంటే గుంపు మేస్త్రీ లాంటిదన్నారు రేవంత్‌ రెడ్డి.

ycp fans trolls revanth reddy
ycp fans trolls revanth reddy

ప్రభుత్వం నడపటం అనేది గుంపు మేస్త్రీ లాంటిది.. సీఎంగా చేయడానికి గుంపు మేస్త్రీగా నాకు ఉన్న అనుభవం సరిపోతుందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే వైయస్ఆర్ సీఎం గా వున్నప్పుడు ఉతికి అరేశానని నోరు జారారు రేవంత్‌ రెడ్డి. దీంతో వైసీపీ సోషల్ మీడియా… మొత్తం రేవంత్‌ రెడ్డిని ట్రోల్‌ చేయడం మొదలు చేసింది. ముఖ్యంగా తెలంగాణ లో వుండే వైయస్ఆర్ అభిమానులు మరియు కాంగ్రెస్ లో వుండే YSR అభిమానులు కూడా కేసీఆర్ కే ఓటు వెయ్యండని పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news