రాహుల్‌ కి కూడా ఇందిరా గాంధీ గతే పడుతుంది..బీజేపీ నేత సంచలనం !

-

రాహుల్‌ గాంధీకి కూడా ఇందిరా గాంధీ గతే పడుతుంది..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేతరాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీ నానమ్మ కు పట్టిన గతినే నీకు పడుతుందని ఒక పబ్లిక్ మీటింగ్ లో బెదిరించారట ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు తన్వీన్దర్ సింగ్ ఆరా.

rahul gandhi indhira gandhi

అయితే… ఇలా ఒక జాతీయ పార్టీ నేతను, ప్రధాన ప్రతిపక్ష నేతను బీజేపీ నాయకుడు బెదిరించిన ప్రధాని మోడీ కానీ హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కానీ ఏ మాత్రం స్పందించక పోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు, బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఏఐసీసీ సూచన మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇచ్చారు.

అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే కార్యక్రమాలలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ లోని అంబేత్కర్ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోయే ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పాల్గొంటారు.. హైదరాబాద్ డీసీసీ ల ఆధ్వర్యంలో, nsui, యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version