కాకినాడ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాకినాడ జీ జీ హెచ్ లో పేషెంట్ కు సినిమా చూపిస్తూ మెదడులోని కణితి తొలగించారు వైద్యులు. కాకినాడ జీ జీ హెచ్ లో పేషెంట్ కు అదుర్స్ సినిమా చూపిస్తూ మెదడులోని కణితి తొలగించారు వైద్యులు. కాకినాడ తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి మెదడులో కణితి ఏర్పడింది.
ఈ తరుణంలోనే… ట్యాబ్ లో ఆమెకు నచ్చిన అదుర్స్ సినిమా చూపిస్తూ అవేక్ క్రేనియాటమీ ట్రీట్మెంట్ చేశారు వైద్యులు. తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఈ శస్త్ర చికిత్స చేయడం వలన ఇబ్బందులు తెలుసుకుంటూ వైద్యం చేయవచ్చని చెబుతున్నారు డాక్టర్లు.