తెలంగాణ ఉద్యమం తరువాత మరోసారి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రాజకీయాల రచ్చ చెలరేగుతోంది. ఈ నెల 6,7 తేదీల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఉండనుంది. 7న ఓయూలో విద్యార్థులను పరామర్శించే కార్యక్రమం ఉంది. అయితే రాహుల్ గాంధీ పర్యటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేఖిస్తున్నారు. దీంతో మరోసారి ఓయూ వార్తల్లోకి వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు వైస్ ఛాన్సలర్ అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల కారణంగా అనుమతి ఇవ్వడం లేదని వీసీ పేర్కొన్నారు. రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని పాలక మండలి నిర్ణయించిన క్రమంలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని వీసీ తెలిపారు. కొన్ని సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలైదని ఆయన తెలిపారు. దీంతో సభకు అనుమతి ఇవ్వకపోవడంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఓయూ ముందు నిరసనలు తెలుపుతున్నారు.