జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఘటనపై తటస్థంగా విచారణ జరిపిద్దాం అంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుకంట మజుందార్ సెటైర్లు వేశారు. ఒక దొంగను తమ గ్రూపులోని దొంగనే విచరిస్తాడా అంటూ వ్యాఖ్యానించారు. దాడి వెనుక ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఇప్పటికే తెలిసిపోయిందన్నారు. పాకిస్థాన్ లోకి కొంతమంది మేమే చేశాం. మేమే చేశామని మొత్తుకుంటున్నారని అన్నారు. ఇంకా ఏం ఇన్విస్టిగేషన్ చేస్తారని మండిపడ్డారు.
కేవలం భయంతోనే పాకిస్థాన్ ప్రధాని అలాంటి కామెంట్లు చేశాడని అన్నారు. ఈ భయం మంచిదేనని భావించారు. ఆయనకు ఈ భయం ఉండాలని, పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నా లేకపోయినా మనం బదులిస్తామని చెప్పారు. పాకిస్థాన్ సిద్ధంగా లేనప్పుడే మనం మరింత బలంగా కొట్టగలమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి వెనక పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని గుర్తించారు. ‘ ఉగ్రవాద సంస్థలను పాక్ పెంచి పోశిస్తోంది అనే ఆరోపణలు సైతం ఉన్నాయి.